Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దూది రైతులకు దుఃఖం.!

దూది రైతులకు దుఃఖం.!

- Advertisement -

అనుకూలించని వాతావరణం
సగానికి తగ్గిన దిగుబడి
నవతెలంగాణ – మల్హర్ రావు

తెల్లబంగారం ఈసారి అశించిన స్థాయిలో దిగుబడి రాక రైతులు దిగాలు చెందుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి 40 నుంచి 50 శాతం దిగుబడి తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి మొదటి దశలో అనుకున్నట్లు పెరిగినా కాత, పూత దశలో అధిక వర్షాలు రావడం తో మొదటి కాయలు మురిగిపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రైతులు ఆశించిన దిగుబడి రాలేదని రైతులు చెబుతున్నారు.ఎకరాకు కనీసం 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉండగా ఈసారి 4 నుంచి 6 క్వింటాళ్లకే పరిమితమైంది. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడులు ఎక్కువ రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనలో ఉన్నారు.

బరువు రాని పత్తి..
పత్తి పంట బరువు సైతం చాలా వరకు తక్కువ వస్తుంది. కూలీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసినా 20 నుంచి 30 కిలోల వరకు మాత్రమే వస్తుంది.దీంతో కూలీలకు కూడా గిట్టు బాటు కావడం లేదు. రోజు కూలీ వారీగా రూ.300 ఇస్తేనే పనికి వస్తామని కూలీలు పేర్కొంటున్నారు.

ఎదగని పత్తి..
పత్తి పంట ఎదుగుదలకు అవరమైన నెలల్లో వర్షా భావం ఫలితంగా ఎదుగుదల పూర్తిగా మందగించింది. 6 నుంచి 7 ఫీట్ల ఎత్తులో ఉండాల్సిన పత్తి మొక్కలు 2 ఫీట్ల నుంచి 4 ఫీట్ల ఎత్తు వరకే పెరిగాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, ముసురు వానలకు చేలల్లో నీరు నిలిచి పత్తి ఎర్రబడి పెరుగుదల లేక అనేక తెగుళ్లు వ్యాపించాయి.ఎన్ని సార్లు మందులు పిచికారీ చేసినా పత్తి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. మొదటి దశలో ఒక్కో పత్తి చెట్టుకు 30 నుంచి 40 కాయలు కాయల్సి ఉండగా అధిక వర్షాలతో కాయలు మురిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూ లై, ఆగస్టు అక్టోబర్ వరకు కూడా కురిసినా భారీ వర్షాలతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -