Saturday, December 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జీవాల రక్షణకు నట్టల నివారణ మందు తప్పనిసరి

జీవాల రక్షణకు నట్టల నివారణ మందు తప్పనిసరి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
గొర్రెలు, మేకల సంరక్షణకు నట్టల నివారణ మందులు వేయించడం అవసరమని మండల పశువైద్యాధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ అన్నారు. శనివారం రోటిగూడ, చింతలపల్లి గ్రామాల్లో 3,200 గొర్రెలు, 800 మేకలకు మందులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో జీవాలను జాగ్రత్తగా చూసుకోవాలని, మందులతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది 2 గ్రామాల సర్పంచ్ లు పంజాల నరేష్, బెల్లంపల్లి గోపాల్, ఉప సర్పంచ్ లు , రైతులు,  సిబ్బంది ఉమేష్, కిషన్, సంజీవ్,రమేష్ గోపాలమిత్ర, ప్రశాంత్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -