భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజా పాలన కొనసాగిస్తుందని భువనగిరి లోకసభ పరిధిలో సర్పంచులందరు పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
శనివారం ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ..భువనగిరి పార్లమెంటు పరిధిలోగల 968 గ్రామ సర్పంచ్ లుగా ఎన్నికైన సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. పార్టీలకతీతంగా స్వీట్ బాక్స్ నూతన సంవత్సర సంక్రాంతి గ్రీటింగ్స్ అందజేసినట్లు చెప్పారు. రేజింగ్ తెలంగాణలో గ్రామాల పాత్ర ముఖ్యమైందన్నారు. మాజీ మంత్రి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తండ్రి కూడా సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా స్వీట్ బాక్స్ నూతన సంవత్సర గ్రీటింగ్ కార్డ్ పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో సంక్షేమ పథకాలలో అర్హులైన ప్రజలందరికీ అందే విధంగా సర్పంచులు కృషి చేయాలని కోరారు.



