పోరాట గడ్డపై సీపీఐ(ఎం) పోటీ

– ఇబ్రహీంపట్నం బరిలో నిలిచేందుకు రెడీ
– స్పష్టం చేసిన రాష్ట్ర నాయకత్వం
– త్వరలో అభ్యర్థి ప్రకటన
– పార్టీ శ్రేణులను ఎన్నికలకు
– సిద్ధం చేస్తున్న జిల్లా కమిటీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రగా పోటీ చేసేందుకు సీపీఐ (ఎం) సిద్ధమైంది. ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలనుకున్న ప్పటికీ ఆ పార్టీతో టికెట్ల కేటాయింపు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించిది. తమ శక్తి మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. దీంతో కామ్రేడ్స్‌ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలో సీపీఐ(ఎం) కంచుకోట. ఇక్కడ ఎక్కువ కాలం కమ్యూ నిస్టులు ప్రాతినిధ్యం వహించారు. తప్పకుం డా ఇక్కడి నుంచి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటిస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే పోటీ ఉండదని అందరూ భావించారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఇక్కడ సీపీఐ(ఎం) పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నియోజక వర్గంలో మరోసారి ఎర్రజెండా ఎగురవే సేందుకు సీపీఐ(ఎం) సిద్ధం అవుతోంది. కేంద్రీకరించిన నియోజకవర్గ జాబితా లో ఇబ్రహీంపట్నం ఉండటం.. ఈ ప్రాం తంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం ఎర్రజెండాకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు కమ్యూనిస్టులు ప్రాబల్యంతో వేల ఎకరాల ప్రభుత్వ భూములను పేదల కు పంపిణీ చేసిన చరిత్ర ఉంది. పేదల కోసం అనేక పనులు చేశారు. ఆనాడు ప్రజలకు చేసిన సేవ కమ్యూనిస్టులకు కలిసివ స్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love