– కోన సముందర్ సర్పంచ్ బెజరపు రాకేష్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
విద్యార్థులు బాగా చదువుకొని గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ బెజరపు రాకేష్ అన్నారు. శనివారం మండలంలోని కోన సముందర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ బెజరపు రాకేష్, ఉప సర్పంచ్ బాలేరావ్ శంకర్ ను ఘనంగా సన్మానించారు.
పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెజరపు రాకేష్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవడం ద్వారా గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీని ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు సామ పటేల్, సురేందర్, ఎస్ఎంసి మాజీ చైర్మన్ పోతుగంటి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.



