- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామంలో శనివారం గ్రామానికి చెందిన సంతోష్ పటేల్ సీసీ కెమెరాలు వితరణ చేశారు. పాఠశాల గ్రామానికి దూరంగా ఉండటంతో పాఠశాలలో రాత్రి సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విలువైన వస్తువులు దొంగల బారినుండి కాపాడటానికి సంతోష పటేల్ ముందుకు వచ్చి సీసీ కెమెరా ఇవ్వడం సంతోషకరమని ఆ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,ఉప సర్పంచ్ బాలరాజ్,గ్రామ పెద్దలు మధుకర్ పటేల్, సంజు మహారాజ్,శ్రీకాంత్ గౌడ్,అబ్దుల్ ఆఫీజ్, రహీమ్ ,రాములు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



