Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్మహిళ మెడలో గొలుసు చోరీ.!

మహిళ మెడలో గొలుసు చోరీ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం):మండలంలోని రేగులగూడెం గ్రామపరిదిలోని దేవరాంపల్లిలో కామిడి లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని దుండగుడు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం..లక్ష్మి, మల్లయ్య దంపతులిద్దరే ఇంట్లో ఉంటారు. ఆదివారం రాత్రి యథావిధిగా ఇంట్లో నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున లక్ష్మి ఇంట్లో కరెంట్ లేకపోవడంతో తలుపు తీసుకుని బయటికి వచ్చింది. బయట కరెంట్ ఉన్నది చూసి అటుఇటు చూడగా వారింటికి వచ్చే మీటర్ వైర్ తెగిపడి ఉంది. వైర్ ను పక్కన పడేసిన లక్ష్మి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి బయటకు వస్తుండగా గుర్తు తెలియని దుండగుడు మెడలోని పుస్తెల తాడును తెంపుకుని పారిపోయాడు.దీంతో లబోదిబోమంటూ ఏడుస్తూ కేకలు వేయగా ఇంటి పక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని అదే గ్రామంలో, గారెపల్లిలో ఉండే కుటుంబసభ్యులకు ఫోన్ లో సమాచారమిచ్చారు. మూడు తులాల పుస్తెల తాడును దుండగుడు తెంపుకుని వెళ్తుండగా అర తులం ఉండే పుస్తెలు కిందపడ్డాయి. లక్ష్మి మెడకు చైన్ తెగి కోసుకుంది. రెండున్నర తులాల బంగారు చైన్ దుండగుడి చేతుల్లో చిక్కింది. కాగా దుండగుడు ప్లాన్ ప్రకారమే ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఉండడం గమనించి కరెంట్ వైరును కట్ చేశాడు. కరెంట్ లేకుంటే ఉక్కపోతతో బయటకు వస్తారనే ఆలోచనతో ఈ ప్లాన్ కు దిగినట్లు పలువురు భావిస్తున్నారు. చోరీకి గురైన చైన్ విలువ సుమారు రూ.2లక్షలుంటుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -