Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బృందంలో ఎమ్మెల్యే మనుమరాలు

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బృందంలో ఎమ్మెల్యే మనుమరాలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో ఎమ్మెల్యే మనమరాలు అత్యంత ప్రతిభ కనపరిచింది. భరత్ ఆర్ట్స్ అకాడమీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా కలిసి నిర్వహించిన కూచిపూడి కళ వైభవం-2, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం గురువు డాక్టర్” నవ్య నాగబండి శిక్షణలలో ఒకే వేదిక పై ఒకే సారి 7209 మంది చిన్నారుల బృందం కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.ఈ బృందంలో స్థానిక ఎమ్మెల్యే  పైడి రాకేష్ రెడ్డి కూతురు ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి దంపతుల కూతురు చిన్నారి జయ రెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో భాగం అవడం సంతోషంగా ఉందని తాత ఎమ్మెల్యే, చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు గురువు కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -