Saturday, December 27, 2025
E-PAPER
Homeక్రైమ్నిజామాబాద్ నగరంలో రెండు ఏటీఎంలలో చోరీ 

నిజామాబాద్ నగరంలో రెండు ఏటీఎంలలో చోరీ 

- Advertisement -

సంఘటన స్థలాలను పర్యవేక్షించిన ఇంచార్జి పోలీస్ కమిషనర్ ( కామారెడ్డి )
ఐదు స్పెషల్ టీం ల ఏర్పాటు
ముమ్మరంగా తనిఖీలు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ నగరంలో రెండు ఏటీఎంలో చోరీ జరిగింది. శనివారం తెల్లవారుజామున నిజామాబాదు నగరంలో టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగ్ర బ్రాంచ్ కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏ. టి. ఎమ్, టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద గల ఎస్.బి.ఐ బ్యాంక్ ఏ. టి. ఎమ్ లను గుర్తుతెలియని దొంగలు దాడి చేసి అందులో గల నగదును దాదాపు రూ.30 లక్షల వరకు దోచుకుని వెళ్లినటువంటి సంఘటన చోటు చేసుకుంది.

సంఘటన స్థలాలను నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ గౌరవనీయులు ఎం. రాజేష్ చంద్ర, ఐ.పీ.ఎస్. ( కామారెడ్డి ) పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. సంఘటనల స్థలాలను క్షుణ్ణంగా పర్యవేక్షించి తగు చర్యలు / సంఘటన స్థలాల పరిశీలన: ఏటీఎంల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, చోరీ జరిగిన విధానం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను అధ్యయనం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ సేకరణ, ఏటీఎం లోపలి మరియు పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణకు ఆదేశించారు.

ప్రత్యేక బృందాల ఏర్పాటు: 
క్లూస్ టీమ్, సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీస్ బృందాలతో 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ పెంపు రాత్రి వేళల్లో ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచారు.నిఘా కట్టుదిట్టం,జిల్లా లో ప్రవేశ–నిష్క్రమణ పాయింట్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.

బ్యాంకులతో సమన్వయం.. ఏటీఎం భద్రతను బలోపేతం చేయడానికి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకొని అలారం వ్యవస్థలు, అదనపు సీసీటీవీలు, లైటింగ్ మెరుగుదలపై సూచనలు ఇచ్చారు. జిల్లా లో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని ప్రజలకు భరోసా కల్పించారు. నిందితుల గుర్తింపు, పట్టుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో నగరంలో భద్రత మరింత బలోపేతం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తునదని తెలియజేసారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి.బస్వారెడ్డి , నిజామాబాదు ఏసిపి  రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం, 4 టౌన్ ఎస్హెచ్ఓ  సతీష్ కుమార్ , టౌన్ సిఐ  శ్రీనివాస్ రాజ్, 4 టౌన్ ఎస్ఐ  గంగాధర్  బ్యాంక్ మేనేజర్  శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -