- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
సమాజాన్ని వాస్తవికత వైపు మళ్ళించే ప్రయత్నంలో జీవితాంతం పోరాటం చేసిన పెరియార్ ఈవీ రామస్వామి వర్ధంతి సభకు మేధావులు తరలిరావాలని జన జాగృతి కళా సమితి అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెరియార్ వర్ధంతి సభ జరుగుతున్న నేపథ్యంలో హుస్నాబాద్ నుంచి పెరియార్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆయన వెంట దళిత సంఘాల నాయకులు కొలువురు అశోక్, బోయిని రాజశేఖర్, ఆనందం తదితరులున్నారు.
- Advertisement -



