Saturday, December 27, 2025
E-PAPER
Homeజిల్లాలురిటైర్డ్ అంగన్వాడీల పట్ల వివక్ష తగదు: సీఐటీయూ 

రిటైర్డ్ అంగన్వాడీల పట్ల వివక్ష తగదు: సీఐటీయూ 

- Advertisement -

సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

40 సంవత్సరాలకు పైగా సేవ చేసిన రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల వివక్షత సరైనది కాదు అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఐసిడిఎస్ వ్యవస్థలో 40 సంవత్సరాలకు పైగా అంగన్వాడీ విధులలో పేదలకు అనేక సేవలు అందించిన అంగన్వాడి ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ ప్రకటించటంతో 2024 జూన్ నెలలో ఐసిడిఎస్ అధికారులు రిటైర్మెంట్ ప్రకటించటం వలన వారిని విధులలో నుండి తొలగించటం జరిగిందని శనివారం సిఐటియు కార్యాలయంలో రిటైర్డ్ అయిన అంగన్వాడీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాల వరకు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక సేవలు అందించిన అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ వారికి రెండు లక్షల బెన్ఫిట్, పెన్షన్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి వారిని విధుల్లో నుండి తొలగించి సుమారు రెండు సంవత్సరాలు అవుతోందని అన్నారు. వారికి ఇంతవరకు బెనిఫిట్స్ ఇవ్వకుండా పెన్షన్ను కల్పించకుండా, వారికి రావలసిన బకాయిలు కూడా చెల్లించడం లేదని తెలిపారు. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు మానసిక వేదనతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. వృద్ధాప్యంలో వారికి ఈ విధంగా ఇబ్బందులు గురి చేయటం సరైనది కాదని, ప్రభుత్వం వెంటనే వారికి ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగుల నాయకులు హైమావతి, లలిత, రమ, పుష్ప, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -