నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో సర్పంచ్ భూషణ్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో శనివారం గొర్రెలు, మేకలకు నివారణ మందుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ మాట్లాడుతూ.. 452 గొర్రెలకు, 193 మేకలకు నివారణ మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ మందుల వల్ల పశువులు తీసుకునే మేతలోని పోషకాలు శరీరానికి సమర్థంగా చేరి, వాటి పెరుగుదలతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పశువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా టీకాలు, మందులు వేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు.
ఇలా నివారణ చర్యలు చేపడితే పశుపాలకులకు ఆర్థిక నష్టం తప్పుతుందన్నారు. సర్పంచ్ భూషణ్ మాట్లాడుతూ గ్రామ పశుసంపద రక్షణే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. పశుపాలకులు ప్రభుత్వం అందించే ఉచిత పశువైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూషణ్,పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర, నర్సయ్య, సాయి, సరళ రాణి, రోజా తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ, జానకంపేట గ్రామాలలో సైతం పశువులకు నివారణ మందులు వేసినట్టు పశు వైద్యాధికారి సంతోష్ రెడ్డి శనివారం తెలిపారు.



