Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దైవభక్తితో మానసిక ప్రశాంతత 

దైవభక్తితో మానసిక ప్రశాంతత 

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ – కట్టంగూర్
ప్రతి ఒక్కరిలో దైవభక్తి కలిగి ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీసాయిమణికంఠ దేవాలయంలో అయ్యప్ప స్వామి 16వ మండల మహా పడి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని అయ్యప్పస్వామికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. అయ్యప్ప మండల మహా పడి అనేది భక్తుల అంతర్గత శుద్దికి, ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడే ఒక ముఖ్యమైన కార్యక్రమం అన్నారు.

అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, కట్టంగూర్, పామనుగుండ్ల, మల్లారం సర్పంచ్ లు ముక్కాముల శ్యామల శేఖర్, వడ్డె మాధవిసైదిరెడ్డి, పెద్ది నాగమణిమల్లేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పొగుల నర్సింహ్మ, నాయకులు పెద్ది బాలనర్సయ్య. అంతటి శ్రీను, ఎకుల సైదులు, ఆలయ పూజారి కొటారు సత్యనారాయణ శర్మ, అయ్యప్ప మాలదారులు గురుస్వామి, గాదగోని వెంకన్న, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -