బీఆర్ఎస్ బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లు మురళి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామం నుండి అధిక సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్ ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి బయలుదేరామని బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లు మురళి తెలిపాడు. శనివారం మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రథసారథి కేటీఆర్, మాజీ మత్రి సత్యవతి రాథోడ్ , మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షురాలు కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, చేతుల మీదుగా బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచ్ చిర్రా యకాతం గౌడ్ సన్మానo ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని అందుకున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఈ సన్మాన కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.



