Sunday, December 28, 2025
E-PAPER
Homeఖమ్మంక్రైస్తవ, మైనారిటీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం

క్రైస్తవ, మైనారిటీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం

- Advertisement -

– కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆర్ధిక సహాయం
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని రైతు వేదిక లో శనివారం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవిస్తూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చారు.అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని క్రైస్తవ మైనారిటీ సంక్షేమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని  తెలిపారు. అశ్వారావుపేట లో క్రైస్తవులు నిర్మించుకునే కమ్యూనిటీ భవన నిర్మాణానికి నా వ్యక్తిగతంగా రూ.1 లక్ష ఆర్ధిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, ఎంపీడీవో అప్పారావు,ఆత్మ (బీఎఫ్ఏసీ ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -