ఇందుకు ప్రతి ఒక్కరి సహకరించాలి గ్రామ సర్పంచ్: చెలిమేల శ్రీనివాస్
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చి దిద్దు్దామని ఇందుకు గ్రామస్థులకు సహకారం ఎంతో అవసరమనీ గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. ఈసందర్బంగా అయన శనివారం తన పాలకవర్గాన్ని, గ్రామ కార్యదర్శి నీ వెంట పవట్టుకొని గ్రామములోని పలువిధుల్లో పర్యటించారు. గ్రామములోని కొన్ని విధుల్లో గ్రామస్థులు చెత్త, చెదారం, ప్లాస్టికి, చికెన్ వ్యర్తలు ఎక్కడ పడితే అక్కడ వేయడంతో దుర్గంధం వెదజల్లడం చూసి నిర్వేయపోయారు.ఇది గమనించి స్పందించిన స్థానిక వార్డు మెంబర్ నిమ్మల వినయ్ గౌడ్ తన సొంత ఖర్చులతో గ్రామములోని ఊర చెరువు ప్రాంతంలో చెత్త, చికెన్ వ్యర్తలను తొలగించారు.
ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇకపై గ్రామస్థులు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం కుదరదని, ప్రతి రోజు గ్రామములో అన్ని విధుల్లో పంచాయతీ ట్రాక్టర్ వస్తుందని, తడి, పొడి, చెత్త ప్లాస్టిక్ లాంటివి ఏవైనా ట్రాక్టర్లో వెయ్యాలని, వాటిని డంపింగ్సూ యారదుకు పంచాయతీ సిబ్బంది తరలిస్తారని చించారు. ఇక గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా, వీధులు సుందరికరణ కార్యక్రమం నిర్వహించనున్నామని అన్నారు. ఇందుకు ప్రతి గ్రామస్తుడు సహకరించాలని కోరారు. ఐనప్పిడే గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చాగలమణి అన్నారు.ప్రధాన రహదారిలో ఉన్న దుకాణ సముదాయ యజమానులు ప్రత్యేకంగా రోడ్లపై తమ చెత్త రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, వార్డ్ మెంబర్ నిమ్మల వినయ్ గౌడ్, రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.



