నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రం నుండి హసకొత్తుర్ వెళ్లే దారిలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన బీటీ రోడ్డుపై వున్న ప్రమాద కరమైన గుంతలను శనివారం పూడ్చివేశారు. ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు బిటి రోడ్డు పై ఏర్పడ్డ పెద్దపెద్ద గుంతల మూలంగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామపంచాయతీ సిబ్బందితో బిటి రోడ్డు పై ఉన్న ప్రమాదకరమైన గుంతలను పూడ్పించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లో సిబ్బంది ఇసుక కంకర సిమెంట్ తో కలిపిన మిశ్రమాన్ని తీసుకువచ్చి గుంతల్లో నింపి పూడ్చివేశారు. బీటీ రోడ్డుపై గుంతలను పూడ్చడం పట్ల వాహనదారులు హర్షం చేస్తూ, ప్రత్యేక చొరవ చూపిన సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమములో తెడ్డు రమేష్ , మండపల్లి మహేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
బీటీ రోడ్డుపై ప్రమాదకరమైన గుంతల పూడిచివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



