Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమానవతా విలువల్ని నేర్పించేలా 'కికి అండ్‌ కోకో'

మానవతా విలువల్ని నేర్పించేలా ‘కికి అండ్‌ కోకో’

- Advertisement -

అద్భుతమైన కంటెంట్‌తో హృదయాన్ని హత్తుకునే రీతిలో రూపొందుతున్న యానిమేషన్‌ సినిమా ‘కికీ అండ్‌ కోకో’. పిల్లలకు, పిల్లల మనసున్న పెద్దలకు నచ్చేలా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇనికా స్టూడియోస్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ధరణి నిర్మాత. పి. నారాయణన్‌ దర్శకుడు. బాలనటి శ్రీనిక కొకొ పాత్రలో నటించింది. మీనా చాబ్రియా సీయీవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న యానిమేషన్‌ మూవీ త్వరలో థియేటర్స్‌తో పాటు 9 భాషల్లో ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్ర టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బాలనటి శ్రీనిక, క్రియేటివ్‌ డైరెక్టర్‌ గోకుల్‌ రాజ్‌ భాస్కర్‌, సీయీవో మీనా చాబ్రియా పాల్గొన్నారు.

డైరెక్టర్‌ పి.నారాయణన్‌ మాట్లాడుతూ, ‘దురదృష్టవశాత్తూ మన పిల్లలు హింసకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. మేము మా సినిమాలో పిల్లలకు జీవితాల్లోని రియాల్టీ చూపించాలని ప్రయత్నిస్తున్నాం. మనల్ని మనం ఇష్టపడటం, పెద్దలను గౌరవించడం, తప్పు చేస్తే సారీ చెప్పడం, సాయం చేస్తే కృతజ్ఞత తెలపడం, మనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేయడం ఇలాంటి మంచి అలవాట్లను పిల్లలకు పరిచయం చేయాలని అనుకుంటున్నాం’ అని తెలిపారు. ‘మా యానిమేషన్‌ సినిమా ద్వారా పిల్లలకు మన ఎమోషన్స్‌, వ్యాల్యూస్‌ను చెబుతున్నాం. జీవితంలోని వాస్తవికతను, మంచిని పిల్లలకు నేర్పాలనేది మా సినిమా ముఖ్య ఉద్దేశం. థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ మాసినిమాను రిలీజ్‌ చేయబోతున్నాం’ అని ప్రొడ్యూసర్‌ ధరణి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -