పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా ‘నీలకంఠ’. ఎం.మమత, ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ వైభవంగా నిర్వహించారు.
ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ,’చాలా అవాంతరాలు దాటుకుని మీ ముందుకు మా చిత్రాన్ని తీసుకొస్తున్నాం’ అని తెలిపారు. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ట్రైలర్‌లాగే సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని ప్రొడ్యూసర్ వేణుగోపాల్ దీవి చెప్పారు. సమర్పకులు ఎం.రాజరాజేశ్వరి మాట్లాడుతూ,’ట్రైలర్ చూస్తుంటే నా లైఫ్‌లో జరిగినవి గుర్తుకొచ్చాయి. మా చిత్రంలో ప్రతి ఆర్టిస్ట్ బాగా చేశారు’ అని తెలిపారు. ‘మంచి ఎమోషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది’ అని డైరెక్టర్ రాకేష్ మాధవన్ చెప్పారు. హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ,’మంచి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు?, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించారు’ అని తెలిపారు.
ఆ నింద ఏంటి?
- Advertisement -
- Advertisement -



