Sunday, December 28, 2025
E-PAPER
Homeసినిమాతెలుగు సినిమా ఆత్మగౌరవ రక్షణే మా లక్ష్యం

తెలుగు సినిమా ఆత్మగౌరవ రక్షణే మా లక్ష్యం

- Advertisement -

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు నేడు (ఆదివారం) జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ సభ్యులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘2014 నుంచి ప్రతి మూడేళ్లకు ఒకసారి యూనియన్‌ వేజెస్‌ సవరణ జరుగుతుంది. ప్రతిసారి దాదాపు డెబ్బై మీటింగ్స్‌ జరిగాయి. 2025లో వేజెస్‌ పెంచాలని అన్నప్పుడు నిర్మాతల పరిస్దితి బాలేదని ఛాంబర్‌ వైపు నుంచి డిలే చేశాం.

ప్రతిసారి వివాదం ఉండకూడదని లేబర్‌ డిపార్ట్మెంట్‌ని అప్రోచ్‌ అయ్యాం. సిఎం రేవంత్‌ రెడ్డి కూడా ప్రోయాక్టీవ్‌గా అందరినీ పిలిచి మాట్లాడారు. ఒక సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్కటిగా సమస్యలను సాల్వ్‌ చేసుకుంటూ వచ్చాం. కానీ కొందరు ఇంకా కావాలని సమస్యలను సష్టిస్తున్నారు. యూనియన్‌ నాయకులు లోపాయికారిగా ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో ఫాల్స్‌ ప్రామిసెస్‌ చేస్తున్నారు. వారి పద్దతి మార్చుకొమని చెప్పాం. నిజానికి వ్యక్తిగతంగా లబ్ధి పొందే అవసరం మాకు లేదు. ఆ స్థానంలో ఉండాలంటే చాలా ఎనర్జీ, టైం స్పెండ్‌ చేయాలి. ఇది అమ్మలాంటి సంస్థ. ఆ సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ ఇండిస్టీకి ఫాదర్‌ లాంటి వారు ప్రొడ్యూసర్‌. ప్రొడ్యూసర్‌ బతికితేనే ఇండస్ట్రీ రన్‌ అవుతుంది’ అని తెలిపారు.

-ఫిల్మ్‌ ఛాంబర్‌ బిల్డింగ్‌ మన అమ్మ లాంటిది. ప్రభుత్వం ఈ భూమి ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ ఇక్కడ బతకాలని, ఎవరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికి కాదు.
-20 ఏళ్లుగా ఒక్క సినిమా తీయని ఆ 1% మంది, రాత్రి పగలు కష్టపడి సినిమాలు తీసే 99% మంది యాక్టీవ్‌ నిర్మాతలను శాసించాలని చూడటం వల్లే ఆత్మరక్షణ కోసం గిల్డ్‌ ఏర్పడింది.
-క్యూబ్‌, యు.ఎఫ్‌.ఓల దోపిడీపై సిసిఐ కోర్ట్‌లో కేసు వేసి, న్యాయపోరాటం చేస్తున్నది కేవలం యాక్టివ్‌ నిర్మాతలే. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కు మూవీ టవర్లో ఉన్న వాటాను దొంగచాటుగా అమ్మేసి బ్లాక్‌ మనీ డీల్‌ చేయాలని చూసిన భారీ కుట్రను మేము అడ్డుకున్నాం.
-మేము ఇన్సూరెన్స్‌ ఆపలేదు. నిజానికి మేము ఆపింది దోపిడీని. పేద నిర్మాతలకు నేరుగా రూ.4 లక్షల క్యాష్లెన్‌ కార్డు ఇవ్వాలన్నదే మా లక్ష్యం.
-చిన్న సినిమాల కోసం వర్కర్ల జీతాల్లో 25% తగ్గింపు ఉండాలని పోరాడుతున్నది మేమే. ఇప్పుడు మాపై విమర్శలు చేసేవారే అప్పట్లో దీన్ని అడ్డుకున్నారు. చిన్న నిర్మాత నాశనమైపోయినా వీరికి పర్వాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -