Wednesday, May 21, 2025
Homeఆటలురాణించిన శ్రీకాంత్‌

రాణించిన శ్రీకాంత్‌

- Advertisement -

మలేషియా మాస్టర్స్‌ ఓపెన్‌
కౌలాలంపూర్‌ : పురుషుల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1, భారత వెటరన్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ మలేషియా మాస్టర్స్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో ఆకట్టుకున్నాడు. మంగళవారం జరిగిన అర్హత రౌండ్‌లో వరుస విజయాలు సాధించిన కిదాంబి శ్రీకాంత్‌ ప్రధాన టోర్నమెంట్‌కు చేరుకున్నాడు. చైనీస్‌ తైపీ షట్లర్‌ హుయాంగ్‌ యుపై 9-21, 21-12, 21-6తో మూడు గేముల మ్యాచ్‌లో శ్రీకాంత్‌ విజయం సాధించాడు. తొలి గేమ్‌లో నిరాశపరిచినా.. వరుస గేముల్లో సత్తా చాటాడు. అంతకుముందు, చైనీస్‌ తైపీకే చెందిన మరో షట్లర్‌ కుయాన్‌ లిన్‌పై 21-8, 21-13తో శ్రీకాంత్‌ అలవోక విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ ప్రధాన డ్రా తొలి రౌండ్లో నేడు ఆరో సీడ్‌ చైనా ఆటగాడు జుయాంగ్‌ జుతో శ్రీకాంత్‌ తలపడనున్నాడు. భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, హెచ్‌.ఎస్‌ ప్రణరు సైతం నేడు తొలి రౌండ్లో బరిలోకి దిగుతున్నారు.
క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో శ్రీకాంత్‌ మినహా ఇతర షట్లర్లు తేలిపోయారు. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌ మానెపల్లి 13-21, 21-23తో, శంకర్‌ ముతుస్వామి 20-22, 20-22తో ఓటమి చెందారు. మహిళల సింగిల్స్‌లో అన్మోల్‌ 14-21, 18-21తో తేలిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మోహిత్‌, లక్షిత జోడీ 15-21, 16-21తో వరుస గేముల్లో చేతులెత్తేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -