Sunday, December 28, 2025
E-PAPER
Homeఆటలుఆయుశ్‌ మాత్రెకు కెప్టెన్సీ

ఆయుశ్‌ మాత్రెకు కెప్టెన్సీ

- Advertisement -

అండర్‌-19 ప్రపంచకప్‌కు భారత జట్టు

ముంబయి : అండర్‌-19 ఐసీసీ ప్రపంచకప్‌ భారత జట్టుకు ఆయుశ్‌ మాత్రె సారథ్యం వహించనున్నాడు. ఇటీవల యూత్‌ వన్డే ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో కీలకంగా వ్యవహరించిన ఆయుశ్‌ మాత్రె ప్రస్తుత దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికగా ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ జరుగనుంది. ఐదు సార్లు చాంపియన్‌ టీమ్‌ ఇండియా (2000, 2008, 2012, 2018, 2022) ఈసారి టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్‌లో భారత్‌ గ్రూప్‌-బిలో న్యూజిలాండ్‌, యుఎస్‌ఏ, బంగ్లాదేశ్‌తో కలిసి ఆడనుంది. ప్రపంచకప్‌ ముంగిట భారత్‌.. దక్షిణాఫ్రికా అండర్‌-19 జట్టుతో మూడు యూత్‌ వన్డేలు ఆడనుంది. జనవరి 3, 5, 7న విల్లోమూరె పార్క్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దక్షిణాఫ్రికాతో యూత్‌ వన్డే సిరీస్‌కు భారతకు వైభవ్‌ సూర్యవంశీ కెప్టెన్సీ వహించనున్నాడు.

అండర్‌-19 ప్రపంచకప్‌కు భారత జట్టు :
ఆయుశ్‌ మాత్రె (కెప్టెన్‌), విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, అరోన్‌ జార్జ్‌, వేదాంత్‌ త్రివేది, అబిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), హర్వాన్స్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ఆర్‌.ఎస్‌ అంబరీష్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ ఏ పటేల్‌, మహ్మద్‌ ఎన్‌ఆన్‌, హేనిల్‌పటేల్‌, దీపేశ్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌, ఉదవ్‌ మోహన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -