- Advertisement -
ముంబయి : ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో రూ.11,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం మార్కెట్ రెగ్యూలేటర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపిఒలో భాగంగా ఫ్రెష్ ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) రూపంలో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వాటాలను విక్రయించనున్నారు. కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్ పద్ధతిలో సెబీకి దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూకు మోర్గాన్ స్టాన్లీ, యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ, గోల్డ్‌మన్ శాక్స్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.
- Advertisement -



