Sunday, December 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూరాలజీ విభాగంలో సబ్‌-స్పెషాలిటీ క్లినిక్‌లు

యూరాలజీ విభాగంలో సబ్‌-స్పెషాలిటీ క్లినిక్‌లు

- Advertisement -

నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ పంజాగుట్ట నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లోని యూరాలజీ అండ్‌ రీనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విభాగంలో యూరో-ఆంకాలజీలి, రీనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, పీడియాట్రిక్‌ యూరాలజీ మూడు సబ్‌-స్పెషాలిటీ క్లినిక్‌లను ప్రారంభించనున్నట్టు నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్లినిక్‌లు యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాహుల్‌ దేవర్‌ ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్పెషాలిటీ బ్లాక్‌ 6వ అంతస్తులోని యూరాలజీ విభాగంలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సేవల ద్వారా మూత్ర సంబంధిత క్యాన్సర్‌ వ్యాధులు, కిడ్నీ మార్పిడి చికిత్సలు, పిల్లల యూరాలజీ సమస్యలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రజలకు నాణ్యమైన, వైద్య సేవలు మరింత సులభంగా అందుతాయని డైరెక్టర్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -