Sunday, December 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయాలి

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయాలి

- Advertisement -

రేవంత్‌రెడ్డిది డైవర్షన్‌ కరప్షన్‌ పాలసీ
బీఆర్‌ఎస్‌ కాలంలోనూ ప్రాజెక్టులకు తీరని అన్యాయం : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత


నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
గతంలో బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష చూపుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన డైవర్షన్‌ కరప్షన్‌ అన్న రీతిలో కొనసాగుతున్నదని ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో హిమాలయ కన్వెన్షన్‌ హాల్లో శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ఉద్యమ స్థాయిలో కదలాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గద్వాల -మార్చాల రైల్వే లైన్‌ ఏర్పాటుకు నోచుకోలేదని స్వరాష్ట్రంలోనైనా కల నెరవేరుతుందేమోనని కలలు కన్నామన్నారు.

రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు కావస్తున్న రైల్వే లైన్‌ పూర్తి కాకపోవడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 34శాతం అటవీ ప్రాంతం ఉందని, 25 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా 6,500 ఎకరాలు మాత్రమే సాగునీరు పారడం పాలకుల వైఫల్యాలకు నిదర్శన మని విమర్శించారు. రేవంత్‌ గురువు వరద నీటిని వాడుకోవాలని ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు నుంచి కాకుండా జూరాలకు సమాంతరంగా రిజర్వాయర్‌ నిర్మించి సాగు నీటిని సరఫరా చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు నిర్వాకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మూడు పంపులే పని చేస్తున్నాయని విమర్శించారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ జలదోపిడీ చేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి గుడ్లు అప్పగించి చూడటం సరికాదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -