Sunday, December 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకోతులను తప్పించబోయి.. ఆటో బోల్తా

కోతులను తప్పించబోయి.. ఆటో బోల్తా

- Advertisement -

ప్రమాదంలో ఒకరు మృతి

నవతెలంగాణ-జోగిపేట
చెరువు కట్టపై అడ్డుగా వచ్చిన కోతులను తప్పించబోయి ఆటో అదుపు తప్పి చెరువులోకి బోల్తా పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం ఉదయం జరిగింది. జోగిపేట ఎస్‌ఐ పాండు తెలిపిన ప్రకారం.. జమ్మికుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తనతోపాటు అదే గ్రామానికి చెందిన విజయరావు(55)ను ఆటోలో ఎక్కించుకొని గ్రామం నుంచి జోగిపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో అందోల్‌ మండలం అన్నాసాగర్‌ చెరువు కట్టపై ఆటోకు అడ్డుగా ఒక్కసారిగా కోతులు వచ్చాయి. దీంతో డ్రైవర్‌ వాటిని తప్పించే ప్రయత్నం చేయగా.. అదుపు తప్పి ఆటో బోల్తా కొట్టి చెరువులో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న విజయరావు(55) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -