- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్‌కు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు. 2006లో విశాఖపట్నం నుంచి సబ్‌మెరైన్‌లో కలాం ప్రయాణించారు. కాగా గత అక్టోబర్‌లో రఫేల్ జెట్‌లో, 2023లో Sukhoi 30 MKI యుద్ధ విమానంలో ముర్ము విహరించడం తెలిసిందే.
- Advertisement -



