Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ ఎమ్మెల్యేని కలిసిన కమిటీ సభ్యులు

ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ ఎమ్మెల్యేని కలిసిన కమిటీ సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ, రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులు, అఖిలపక్షం ఆధ్వర్యంలో  ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు శాసనసభ్యులు, బీర్ల ఐలయ్య ని నివాసంలో కలిసి కోరారు. అఖిలపక్ష కమిటీ సభ్యుల సూచనకు, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో మాట్లాడతానని, అఖిలపక్ష కమిటీని ముఖ్యమంత్రికి కల్పిస్తానని హామీ హామీ ఇచ్చారని అఖిలపక్ష కమిటీ సభ్యులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ, రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులు పసుపు నూరి వీరేశం, పుట్ట  మల్లేశం, చెక్క వెంకటేష్, కెమిడీ ఉప్పలయ్య, పద్మ   సుదర్శన్, గొట్టిపాముల బాబురావు , గొట్టిపాముల శ్రీనివాస్, కామిటికారి అశోక్, బేతి కృష్ణ హరి, వడ్డేమాన్ నరేందర్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -