Sunday, December 28, 2025
E-PAPER
Homeజిల్లాలుజెండా ఆవిష్కరణ చేసిన కాంగ్రేస్ నాయకులు

జెండా ఆవిష్కరణ చేసిన కాంగ్రేస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ- దర్పల్లి : కాంగ్రేస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆదివారం కాంగ్రేస్ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండలంలోనీ అన్నిగ్రామాల కాంగ్రేస్ నాయకులు మండలకేంద్రములోని గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం కావాలని కాంగ్రేస్ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై పెద్ద ఎత్తున  నిరసన కార్యక్రమాన్ని నిర్వహించ్చింది. ఈసందర్బంగా దర్పల్లి గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రములోని బిజెపి ప్రభుత్వం దేశం అభివృద్ధి చేసే ఆలోచనలు మాని, అనవసర పనులు చేస్తూ దేశ ప్రజల దృష్టిలో పడిపోతుందని ఆగ్రహం వెక్తం చేశారు. వారికీ చేతనైతే దేశ ప్రజలకు మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టిన ప్రజలను ఆదుకోవాలని అన్నారు.

ఆలా కాకుండా గతంలో కాంగ్రేస్ పార్టీ దేశ ప్రజల ఉన్నతి కోరి అనేక సంక్షేమ ప్రతకాలను దేశానికే స్వతంత్రం తెచ్చిన గాంధీజీ లాంటి వారి పేర్లు పెట్టి పథకాలను కొనసాగిస్తే, బీజేపీ నాయకులు మతాల్లో చిచ్చు పెట్టడం, ఉన్న పథకాల పేరు మార్చడం, కూలీలకేందాల్సిన పనులకు లేబర్ కోడ్ తో ఇబ్బందులకు గురించేయడం, దేశ ప్రజలకు నష్టం కల్గించే పనులు చేయడం సబబుకాదని తన ఆవేదనను వెక్తం చేశారు. దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పతనం ఖాయమని అన్నారు. ఉపాధిహమి పేరు తిరిగి చేర్చే వరకు కాంగ్రేస్మ పార్టీ దీనిపై ఉద్యమం చేస్తూనే ఉంటుందని అన్నారు. రానున్న జెడ్పిటిసి, ఎంపిటిసి, ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రేస్తా పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని తీరుతామణి ధీమా వెక్తం చేశారు. అలాగే దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని దేశాన్ని కాపాడుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మిట్టపల్లి గంగారెడ్డి, పుప్పల సుభాష్, జనార్దన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, భగవాన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, చక్రపాణి, అబ్దుల్ హమీద్,పుప్పాల సుభాష్, అక్బర్, పోతారాజు, చెలిమేల నర్సయ్య, చెలిమేల మల్లికార్జున్, ఆర్మూర్ రంజిత్ రెడ్డి, గోపి చంద్, బాలునాయక్, రమేష్ నాయక్త,మంగీత్య నాయక్ది, పోతన్న, జాన్త రెడ్డి, ఎడ్ల గంగాధర్రు, రొండ్ల గంగారెడ్డి, కట్టా గంగమోహన్లు,వినయ్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -