Sunday, December 28, 2025
E-PAPER
Homeఆటలురాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు హాసకొత్తూర్ విద్యార్థిని

రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు హాసకొత్తూర్ విద్యార్థిని

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని హాసకొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని రోషిత రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ ఆదివారం తెలిపారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో జరిగిన హ్యాండ్ బాల్ సెలక్షన్స్ పోటీలలో విద్యార్థిని రిషిత మంచి ప్రతిభ కనబర్చడంతో సెలెక్టర్ లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారని వెల్లడించారు. ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు నారాయణపేట్ లో జరుగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్  పోటీలలో రిషిత పాల్గొంటుందని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మాధురి తెలిపారు. పాఠశాల నుండి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినీ రిషితను పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు అరుణ శ్రీ, ఫిజికల్ డైరెక్టర్ మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -