Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజేపీ విధానాలతో తీవ్ర ముప్పు..

బీజేపీ విధానాలతో తీవ్ర ముప్పు..

- Advertisement -

– మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి 
-ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-బెజ్జంకి

కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కూట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి జీ రామ్ జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చే యత్నం దేశ ప్రజాస్వామ్య,రాజ్యాంగ,పౌర హక్కులకు తీవ్ర ముప్పు పొంచివుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని బస్టాండ్ అవరణం వద్ద రత్నాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు జీ రామ్ జీ పథకం వల్ల భవిష్యత్తులో దేశంలోని పేద ప్రజలు ఇబ్బందుల పడే అవకాశముందని..కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అమలవుతున్న ఉపాధిసామీ పథకంపై బీజేపీ కుట్రలను భగ్నం చేసి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందని కోరారు.నాయకులు లింగాల శ్రీనివాస్,రావుల నర్సయ్య,గూడెల్లి శ్రీకాంత్,భైర సంతోష్,జంగిలి తిరుపతి,రాజి రెడ్డి,శెట్టి రాజు, ఐలయ్య,పులి సంతోష్,పర్శ సంతోష్,జెల్ల ప్రభాకర్, బోయిని ప్రశాంత్,మచ్చ కుమార్,సంధీప్,అయా గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు హజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -