- Advertisement -
నవతెలంగాణ- దర్పల్లి
మంఫలంలోని చల్లగర్గా గ్రామములో ఆదివారం అంగన్వాడీ కేంద్రములో విద్యార్థులకు యూనిఫామ్ లను గ్రామ సర్పంచ్ గాదె నరేష్ పంపిణి చేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామములోని చిన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు అంబన్వాడీలకు పంపించాలని కోరారు. ప్రభుత్వం చిన్నారులకు ఎదిగేందుకు మంచి పౌష్టిక ఆహారం అందిస్తుందని, వాటితో పిల్లల ఆరోగ్యాలు మెరుగు పరుస్తాయని అన్నారు. అలాగే ప్రభ్యుత్వం విద్యార్థులకు బాలామృతం, యూనిఫామ్ లు అందిస్తుందని ఇట్టి కేంద్రాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమములో వార్డు సభ్యులు, కార్యదర్శి దిలీప్, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.
- Advertisement -



