Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ చైనా మాంజ అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు

 చైనా మాంజ అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని 3 వ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించినటువంటి చైనా మాంజ అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు 3 వ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆదివారం మూడవ పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ హరిబాబు మాట్లాడుతూ.. ఈ రోజు నిజామాబాద్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమ్ నగర్, కెనాల్కట్ట ప్రాంతాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న గాలిపటలు, మాంజాలు అమ్ముతున్న షాపుల పైన తనిఖీలు చేయగా గౌతమ్ నగర్ కి చెందిన ప్రమోద్, మహమ్మద్ యునుస్, కెనాల్ కట్టకి చెందిన ఇప్ప సాయి తేజ ల వద్ద ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజలు లభ్యమైనవి.  చైనా మాంజలా వలన మనుషుల ప్రాణాలకు పర్యావరణానికి హాని కలుగుతుంది. కాబట్టి వాటిని ఉపయోగించినా, అమ్మినా,కొన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.. అని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -