- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: జన్నారం మండలం కామన్పల్లిలో స్లాబ్ వేస్తుండగా సిమెంట్ మిల్లర్ ఆపరేట్ చేస్తున్న కొమరం మహేశ్ చేయి ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకోవడంతో మణికట్టు వరకు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది కిషన్, రఫిక్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహేశ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
- Advertisement -



