- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కల్వరి క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాఘ్షీర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ప్రయాణించారు. త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ కూడా అయిన రాష్ట్రపతి కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుండి ఈ జలాంతర్గామిలో బయలుదేరారు. రాష్ట్రపతితో పాటు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరి శ్రేణి జలాంతర్గామిలో రాష్ట్రపతి ప్రయాణించడం ఇదే మొదటిసారి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కల్వరి శ్రేణి సబ్మెరైన్లో ప్రయాణించారు.
- Advertisement -



