Sunday, December 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యుత్ షాక్‌తో కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి బలవన్మరణం

విద్యుత్ షాక్‌తో కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి బలవన్మరణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బాపట్ల(D) వేమూరు(M) బేతాళపురానికి చెందిన అట్లూరి సునీల్ ఓ రైతు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. సునీల్‌కు ఏడాది క్రితమే పెళ్లి కాగా.. భార్య 9 నెలల గర్భవతి కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో విద్యుత్ శాఖ, రైతు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కాగా కొడుకు మరణాన్ని తట్టుకోలేక సునీల్ తండ్రి వేమూరు రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొని చనిపోయాడు. తండ్రీకొడుకులు ఒకే రోజు మరణించడంతో ఆ కుటుంబం జీవనోపాధిని కోల్పోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -