Sunday, December 28, 2025
E-PAPER
Homeకరీంనగర్బీజేపీ కులాల మతాల ప్రాతిపదికన పాలన సాగిస్తుంది..

బీజేపీ కులాల మతాల ప్రాతిపదికన పాలన సాగిస్తుంది..

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

గత పది ఏళ్ల నుంచి బిజెపి కేంద్రంలో కులాల మతాల ప్రాతిపదికన పాలన సాగిస్తుందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన పాల్గొని మాట్లాడుతూ.. భారత దేశ ప్రజలకు అండగా 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందనీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయనీ,ఆనాడు గాంధీ నేతృత్వంలో స్వంతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందనీ,జవహర్ లాల్   నెహ్రూ,ఇందిరాగాంధీ,రాజీవ్ గాంధీ,మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారనీ ఆయన పేర్కొన్నారు.

గ్రామంలోని ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే అందాయనీ, పది సంవత్సరాల బీజేపీ పాలనలో దేశంలో కులాల మతల ప్రాతిపదికన పాలన సాగిస్తుందనీ, పేద ప్రజల ఉపాధి కోసం ప్రారంభించిన పథకాలకు మహాత్మా గాంధీ పార్టీ పేరును తొలగిస్తుందనీ, పేరు తొలగించినంత మాత్రాన ప్రజల నుంచి గాంధీ ని దూరం చేయలేరనీ, కాంగ్రెస్ పార్టీ దేశంలోని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందనీ అన్నారు.


ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, నాలుగు కోట్ల ప్రజల కోరిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనీ, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనీ, దేశంలో గరీబీ హటావో,బ్యాంకుల జాతీయకరణ,ఉపాధి హామీ పథకం వంటి అనేక పథకాలు అమలు చేసిందni అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,లోక్ సభ నేత రాహుల్ గాంధీ సూచనలు సలహాలతో రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందనీ,కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా ఉండి వారి అభ్యున్నతికి కృషి చేస్తోందనీ ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెల్మూల స్వరూప జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత సుర దేవరాజు గడ్డం నరసయ్య ఆకునూరి బాలరాజు బొప్ప దేవయ్య దుబాల వెంకటేశం కొట్టేపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -