- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గిగ్ వర్కర్లు ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి యాప్స్ డెలివరీ బాయ్స్ తమ సేవలను నిలిపివేయనున్నారు. పారదర్శక, న్యాయమైన వేతన చెల్లింపులు, 10 నిమిషాల డెలివరీ మోడల్ను ఉపసంహరించుకోవడం, సరైన ప్రక్రియ లేకుండా ఖాతాలను బ్లాక్ చేయడం ఆపడం, మెరుగైన ప్రమాద బీమా కల్పించడం, హామీ ఇచ్చిన మేరకు పని కేటాయించడం వంటి డిమాండ్లను వారు కోరుతున్నారు.
- Advertisement -



