నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం పై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఆనాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని దేశాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి స్వతంత్రం రావడంలో ముఖ్యపాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించిన టువంటి మహాత్మా గాంధీ జాతీయా ఉపాధి హామీ పథకం పెట్టారు.పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే ఒక దురుద్వేష ధోరణితో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించాలని చూస్తుంది.
దాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెలలో గ్రామాలలో వందరోజుల ఉపాధి హామీ కల్పించడమే కాకుండా వంద రోజులు కూలీలకు వేతనాలు కూడా చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వెంటనే కేంద్ర ప్రభుత్వం తొలగించినటువంటి మహాత్మా గాంధీ పేరును చేర్చాలని ఈ పథకాన్ని నిరంతరం ఇదేవిధంగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



