Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగింపు..బీజేపీదుర్మార్గపు చర్య

ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగింపు..బీజేపీదుర్మార్గపు చర్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగింపు దుర్మార్గపు చర్యని ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్ల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కేశారపు చెంద్రయ్య ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన, నిరసన చేపట్టి, జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించి,జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాతూ.. వికసిథ్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక కమిషన్ గ్రామీన్ అనే పేరు పెట్టడంపై బీజేపీ ప్రభుత్వం జాతిపిత మహాత్మాగాంధీని భారత దేశాన్ని అవమానపర్చడమేన్నారు.

గాంధీ పెరును తొలగించి వీబీజీ రామ్ జీ పేరును పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా, భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.2005 వ సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం  డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చి చట్టం చేయడం జరిగిందని 20 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిరుపేద కూలీల కడుపు నింపుతుందన్నారు. చట్టాన్ని ఉన్నది ఉన్నట్టు అమలు పరిచే వరకు దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బండి స్వామి, కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, వొన్న తిరుపతి రావు, తిర్రి అశోక్, ఇందారపు సారయ్య, పైడాకుల దేవేంద్ర సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఐత రాజిరెడ్డి, బండి రాజయ్య, ప్రకాష్ రావు, సురేష్ రావు, మెరుగు రాజయ్య, దుర్గాప్రసాద్, ఇందారపు శివ, ప్రభాకర్, మధు, రాజ సమ్మయ్య, శ్రీనివాస్, బొబ్బిలి నరేశ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -