Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టెట్ పరీక్ష కు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలి..

టెట్ పరీక్ష కు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలి..

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
జనవరి మూడు నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా పిఆర్టియు తెలంగాణ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి ఎస్ సాయిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొంత జిల్లా కేంద్రాలలో కాకుండా రాష్ట్ర రాజధానిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం, అట్టి కేంద్రాలు కూడా రవాణా సదుపాయాలు లేని సుదూర కళాశాలలో పరీక్షలు నిర్వహించడం, ఎంతవరకు సమంజసం అని అన్నారు. అదేవిధంగా సుమారుగా 70 వేల మంది ఉపాధ్యాయులు పేపర్ వన్, పేపర్ టు పరీక్షలు రాస్తున్నారు. మీరు వయోభారంతో సుదూర ప్రయాణం చేయడం, చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు.

పదవీ విరమణకు దగ్గరు లో ఉన్నవారికి ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని, వీరికి మ్యానువల్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని సంఘపక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కంప్యూటర్ పై పరిజ్ఞానం లేని ఉపాధ్యాయులు ఆన్లైన్ లో పరీక్షలు రాయడం ఎంతవరకు సమంజసం అని అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్కులు అందరి ఉపాధ్యాయులకు సమానంగా ఉండాలని, కొన్ని సామాజిక వర్గాలకు క్వాలిఫై విధానం ఎక్కువ, మరి కొందరికి తక్కువ నిర్ణయించడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా టెట్టు పరీక్షా కేంద్రాన్ని 33 జిల్లాలలో ఏర్పాటు చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -