నవతెలంగాణ – కామారెడ్డి
జనగాం జిల్లా కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలకు కామారెడ్డి జిల్లా బాధ్యులు హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యా వ్యవస్థ పై సుదీర్ఘమైన చర్చలు జరిగాయని, ఈ మహాసభ ల ద్వారా చాలా విషయాలను తెలుసుకోగలిగామని టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు తెలిపారు. ఈ మహాసభలకు కామారెడ్డి జిల్లా నుండి టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు, ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, పి జి హెచ్ ఎం జిల్లా కోశాధికారి రూప్సింగ్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ, సురేష్, నరసింహారావు సార్ పాల్గొన్నారు. మహాసభలకు తెలుగా మంత్రి డాక్టర్ సీతక్క, స్థానిక ఎమ్మెల్యే , పూర్వ ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, నాగేశ్వర్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అతిథులు మాట్లాడుతూ దేశంలోని విద్యావ్యవస్థ అసమానలతో కూడుకున్నదని అందరికీ సమానమైన విద్య అందాలని వివక్షతో కూడిన విద్య సమాజాన్ని విచ్చిన్నం చేస్తుందని అతిథులు పేర్కొన్నారు.
టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలలో పాల్గొన్న టీఎస్యుటిఎఫ్ జిల్లా బాధ్యులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



