నవతెలంగాణ – మర్రిగూడ : మండలంలోని రాంరెడ్డి పల్లి గ్రామపంచాయితీ పరిధిలోని శివన్నగూడ బ్యాలెన్స్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన చర్లగూడెంలో ఆదివారం గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ గ్రామ ప్రజల ప్రస్తుత అవసరాల మేరకు కొన్ని అభివృద్ధి పనులను చేపట్టారు. వీధిలైట్లు వేయించి,గుంతలుగా మారిన రోడ్లకు టిప్పర్ల ద్వారా మట్టి పోయించి చదును చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివన్నగూడ రిజర్వాయర్ ప్రారంభమవుతుందని సంతోషంగా ఉన్న ఈ గ్రామం మరికొద్ది రోజుల్లో కనుమరుగైతుందని తలచుకుంటేనే బాధగా ఉందన్నారు. ఏదేమైనా కొన్ని అభివృద్ధి పనులు జరగాలంటే కొన్ని త్యాగాలు తప్పవని ఈ గ్రామ ప్రజల త్యాగం రిజర్వాయర్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రస్తుత అవసరాల మేరకు చెప్పగానే స్పందించి పనులు చేపట్టిన సర్పంచ్ నరసింహకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎరుకల నిరంజన్, వల్లపు హేమ భాస్కర్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ముంపు గ్రామం కొంత ముస్తాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



