నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఇనాయత్ నగర్ సర్పంచ్ బాణావత్ లలిత రాములు, దొమ్మరి చౌడ్ తండా సర్పంచ్ గుగ్లావత్ మంజుల దేవేందర్ ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ పంచాయతీ నూతన సర్పంచులుగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన వీరు మోర్తాడ్ లోని ప్రజా నిలయంలో సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిని సునీల్ కుమార్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఇనాయత్ నగర్ సర్పంచ్ బాణావత్ లలిత రాములు, దొమ్మరి చౌడ్ తండా సర్పంచ్ గుగ్లావత్ మంజుల దేవేందర్ లకు సునీల్ కుమార్ హామీని ఇచ్చారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా గ్రామాల్లో కృషి చేయాలని సూచించారు.కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, డైరెక్టర్ జైడి శ్రీనివాస్, కన్నె సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
సునీల్ రెడ్డిని కలిసిన ఇనాయత్ నగర్, డిసి తండా సర్పంచులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



