- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డిని ఆదివారం కన్నాపూర్ గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్, ఉప సర్పంచ్ యశ్వంత్ రావ్ పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం నూతనంగా గెలుపొందిన సర్పంచ్ , ఉప సర్పంచ్లకు మోహన్ రెడ్డి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులందరికీ అందేలా, గ్రామ సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కృషి చేయాలని, ఏ సమస్యలు వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



