Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాజంలో ఉపాధ్యాయుల స్థానం గొప్పది 

సమాజంలో ఉపాధ్యాయుల స్థానం గొప్పది 

- Advertisement -

– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 
నవతెలంగాణ మిర్యాలగూడ

సమాజంలో ఉపాధ్యాయుల స్థానం సమన్నతమైనదని, దేశ ఉన్నతి ఔన్నత్యాన్ని కాపాడేది ఉపాధ్యాయులేనని, మెరుగైన సమాజపు  నిర్మాతల ఉపాధ్యాయులే అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ లో జరిగిన ఎస్ టి యు నల్గొండ జిల్లా అధ్యక్షులు కొనకంచి వీర రాఘవులు ఉద్యోగ విరమణ అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మిర్యాలగూడ శాసనసభ్యులు బి లక్ష్మారెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్ టి యు ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సదానంద గౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ పాల్గొని ప్రసంగించారు.

బీసీ జేఏసీ నాయకులు గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల్లోనే అత్యంత చారిత్రక ప్రాధాన్యత కలిగిన సంఘం ఎస్టియు అని అలాంటి మహోన్నత సంఘ నాయకుడుగా వీర రాఘవులు చేసిన సేవలను కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ ఎస్ టి యు నాయకులు కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో కొట్టుకుపోతున్న పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని, భారత విద్యారంగం ప్రపంచ స్థాయిన అందుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో బల్దూరు శ్రీనివాసరావు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఎస్టియు నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తండు భాను ప్రకాష్ గౌడ్, మిర్యాలగూడ ఎస్ టి యు మండల అధ్యక్ష కార్యదర్శులు వీరనారాయణ, విజయ భాస్కర్, మండల విద్యాధికారి మంగ్యా నాయక్, బాలాజీ నాయక్,  కె.వి సత్యనారాయణ, ఆర్ శ్రీనివాసరావు కందిమల్ల నరేందర్ రెడ్డి, కొనకంచి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -