– గతంలో కృష్ణ నదిపై ప్రాజెక్టు కట్టకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం
– గోకరం చెరువును పునరుద్ధరించాలి
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండల పరిధిలోని ఎర్రవెల్లి ఎర్రవెల్లి తండా భూ నిర్వాసితులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు ఆదివారం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. కృష్ణా నదిపై ప్రాజెక్టు కట్టడంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి రాష్ట్రాలలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసిన వేల ఎకరాలకు నీళ్లు వచ్చేవని ఆమె అన్నారు. బీఆర్ ఎస్ సర్కార్ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. అనవసరమైన ముంపు లేకుండా డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రత్యేకించి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎర్రవెల్లి గ్రామం పూర్తిగా మునిగిపోయేటు వంటి పరిస్థితి ఉందని ఆమె అన్నారు.
డిండి ఎత్తిపోతల పథకంలో ప్రత్యేకంగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఎర్రవెల్లి అనేటువంటి గ్రామం పూర్తిగా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉందని ఆమె అన్నారు. పక్కనే ఉన్నటువంటి గోకారం ఆల్రెడీ సాగవుతున్నటువంటి ఆయకట్టు కంటే కేవలం ఒక రెండువేల ఎకరాలకు మాత్రమే అదనంగా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి ఉందని ఆమె అన్నారు. అదే ఆయకట్టును ఉన్నటువంటి గోకారం చెరువును పటిష్టంగా చేసుకోవడం ద్వారా ఎర్రవెల్లి ఎర్రవెల్లి తండా ముంపుకు గురికాకుండా ఉంటాయని ఆమె అన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు పట్టించుకోకుండా రెండు గ్రామాలు మునిగిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పై ఆమె ధ్వజమెత్తారు.
గోకారం చెరువును పునరుద్ధం చేయాలని ఆమె అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ గ్రామాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని గ్రామస్తులు మొన్న జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లో బహిష్కరించడం జరిగిందని ఆమె అన్నారు. అయినా కూడా ఏ ప్రభుత్వం స్పందించకపోవడం ఈ నాయకులు స్పందించకపోవడం పై ఆమె విమర్శించారు. తెలంగాణ జాగృతి ఎర్రవెల్లి గ్రామం ఎర్రవెల్లి తండా పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఆమె అన్నారు. డిండిలో చేపట్టినటువంటి ప్రాజెక్టు ఆయకట్టు తగ్గకుండా చేసేటటువంటి అల్ట్రా నెట్ ప్రపోజల్ తో ప్రభుత్వంతో మాట్లాడుతామని, ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి ప్రజల పక్షాన ఆలోచించాలని ఎర్రవెల్లి గ్రామాన్ని ఎర్రవెల్లి తండా ను కాపాడాలని ఆమె అన్నారు.



