నవతెలంగాణ – మిర్యాలగూడ
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య ఆవిష్కరించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ లు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం ఎనలేని కృషి చేసిందని, దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలందరిని ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలందరికి న్యాయం జరిగేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



