– కార్మికుల డిమాండ్లు సఫలం చేసిన యాజమాన్యం
– కార్మికులను దేవుళ్ళతో పోల్చిన జిఎండి
– కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదంటున్న పలువురు నేతలు
నవతెలంగాణ – ఊరుకొండ
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మడలం ఊరుకొండ పేట శివారులో గల సూర్యలత స్పిన్నింగ్ మిల్ లో కార్మికుల కష్టానికి తగిన వేతనం ఇవ్వడం లేదని.. కార్మికులు శనివారం సాయంత్రం నుండి కాటన్ మిల్ ముందూ చేపట్టిన ధర్నా ఆదివారం సైతం యధావిధిగా కొనసాగింది. ఈ సందర్భంగా కాటన్ మిల్లులో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచాలి, స్పిన్నింగ్ మిల్ ఒక వర్కర్ కి మూడు సైడ్లు మాత్రమే ఇవ్వాలి, పని భారం తగ్గించాలి, సూపర్వైజర్లు, ఇన్చార్జీలు మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా మాట్లాడడం.. ప్రవర్తించడం మానేయాలని.. మహిళలకు మహిళ సూపర్వైజర్లనే నియమించాలని, మినరల్ వాటర్ కు ఒక్కో కార్మికుల దగ్గర 50 రూపాయల చొప్పున వసూలు చేయడం నిలిపివేయాలని, కాటన్ మిల్లులో మూత్రశాలలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, ప్రతి కార్మికుడికి పివి, ఆటో కోనర్ లలో 40 డ్రమ్స్ ఇవ్వాలని, డ్యూటీ తో పాటు అదనంగా చేసిన పనికి డబ్బులు చెల్లించడం లేదని.. ఓటి చేసినప్పటికీ ప్లే సిప్ లో నమోదు చేయడం లేదని.. ఓటి సైతం ప్లేసిప్ లో జమ చేయాలని, 8 గంటల ఓటీ చేసినప్పటికీ డబల్ వేతనం చెల్లించడం లేదని.. ఆల్ ప్రిపరేటరీ డ్రాయింగ్ మిషన్ ఎల్డిటి ఎల్ డి టు మిషన్లు ఒక్కరికి రెండు మిషన్లు ఆర్ఎస్ బి మిషన్లు ఒక్కరికి మూడు మిషన్లు ఇవ్వాలని, ఓటీ చేసే కార్మికులకు టిఫిన్ కూపన్లు ఇవ్వాలని, కాటన్ మిల్లులో ప్రతి మిషన్ లో హై స్పీడ్ తగ్గించాలని, కార్మికునికి కార్మికులకు కార్మికులకు ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి.. ప్రాథమిక ఆరోగ్య నిమిత్తం అత్యవసర అంబులెన్స్ మరియు వైద్య సదుపాయాలు లేవని వెంటనే తమ డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించాలని చేపట్టిన ధర్నాకు యాజమాన్యం జిఎండి మహేందర్ సింగ్ అగర్వాల్ కార్మికుల వద్దకు వచ్చి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ కాటన్ మిల్లులో పనిచేసే కార్మికులు మాకు దేవుళ్ళతో సమానమని.. కార్మికులకు ఎలాంటి కష్టాలు రాకుండా ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని.. కార్మికులు చేసిన ప్రతి డిమాండ్ ను 2026 జనవరి నెల నుండి అమలయ్యల అన్ని విధాల చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నాను విరమింప చేశారు. అంతకుముందు కార్మికులు చేపట్టిన ధర్నాకు మద్దతుగా పలువురు ప్రజా ప్రతినిధులు.. వివిధ కార్మిక సంఘాల నాయకులు.. ప్రజా సంఘాల నాయకులు.. కుల సంఘాల నాయకులు.. పెద్ద ఎత్తున పాల్గొని పూర్తి మద్దతు తెలిపారు. కార్మికుల డిమాండ్లను యాజమాన్యానికి వివరించేందుకు కార్మికులకు మరియు యాజమాన్యానికి వారధిగా నిలబడి చర్చలు కొనసాగించడంతో.. సానుకూలంగా స్పందించిన యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులందరూ శాంతించారు. కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి యూనియన్ ప్రెసిడెంట్, సర్పంచ్ జర్పులావత్ రమేష్ నాయక్, రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడు మణికంఠ, మాజీ సర్పంచులు మేకల శ్రీనివాసులు, నాగోజి, అమరచింతల శ్రీనివాసులు, సీనియర్ నాయకులు వీరస్వామి, కానుగుల జంగయ్య, ఉప సర్పంచ్ రేపని శ్రీను, జనరల్ మేనేజర్ రమణారెడ్డి, పి ఓ రామంజన్ రెడ్డి, నాయకులు అజహార్, ప్రవీణ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సహదేవ్, స్థానిక ఎస్సై కృష్ణదేవ, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ధర్నాతో కార్మికుల సమస్యలు పరిష్కారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



