Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వాతంత్రోద్యమానికి ఊపిరి కాంగ్రెస్ పార్టీ 

స్వాతంత్రోద్యమానికి ఊపిరి కాంగ్రెస్ పార్టీ 

- Advertisement -

– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ 
– పాలకుర్తిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 
నవతెలంగాణ – పాలకుర్తి

భారత స్వాతంత్రోద్యమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాణం పోసి ఊపిరిని అందించిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమారస్వామి గౌడ్ తో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ

పేదల గొంతుకగా, రైతుల ఆశగా, కార్మికుల హక్కుల రక్షణగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ  140 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే రాజకీయ పార్టీల  లక్ష్యమని, ప్రజల సేవకే కాంగ్రెస్ పార్టీ అంకితమై సేవ చేస్తుందని తెలిపారు. రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్య పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడంలో మహాత్మా గాంధీ చేసిన పోరాట స్ఫూర్తితో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లు భారతదేశానికి ప్రధాన మంత్రులై భారత ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని, అలాంటి మహనీయులకు గుర్తింపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ యేనని  తెలిపారు. ఈ కార్యక్రమంలో 

పాలకుర్తి చాకలి ఐలమ్మ మార్కెట్ చైర్పర్సన్ల్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, సర్పంచులు కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, నీరటి లక్ష్మి చంద్రయ్య, ధరావతు బుజ్జి రవి నాయక్, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతరావు, మాజీ ఎంపీపీ గడ్డం యాక సోమయ్య, మండల మహిళా అధ్యక్షురాలు మనమ్మ, ఎస్సీ సెల్  జిల్లా ఉపాధ్యక్షులు జలగం కుమార్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గాదెపాక భాస్కర్ రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, మార్కెట్ డైరెక్టర్ బానోత్ రమేష్ వాళ్లతో పాటు ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -